తేది:12-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన సర్పంచ్ సల్లా రక్షిత భర్త సల్ల పురుషోత్తం అమ్మకపేట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోశెట్టి ఈ ప్రమాదంలో చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. తెలిపారు అనంతరం వారి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలాల వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి నాయకులు కంతి మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.