సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. టి ఎస్ సి వి అధ్యక్షుడు, న్యాయవాది నర్రి స్వామి.

తేది:12-04-2026 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాTSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం న్యాయవాది నటి స్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ముఖ్యంగా స్త్రీలలో విద్యని అభివృద్ధి చేయడం కోసం కుల వివక్ష నిర్మూలనకు నిరంతరం కృషి చేసి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఎన్నో గ్రంథాలను రచించిన మహాత్మ జ్యోతిరావు పూలే నీ నేటితరం యువత ఆదర్శంగా తీసుకుని బరువు బలహీన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నక్క శ్రీనివాస్ యాదవ్, రాజు మాదిగ, తెలంగాణ సామాజిక వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్, సామాజిక కార్యకర్త నరేందర్, బీసీ సంఘం మహిళా నాయకురాలు ఉపేందర్ యాదవ్, సామాజిక సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *