తేది: 10-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం ముఖ ద్వారం మరమ్మత్తులు చేయాలని ఈవో అంజన రెడ్డి శుక్రవారం ఆలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్బంగా ఆలయ పరిసరాలను పరిశీలించిన అయన ఆలయ గోపురానికి ఉన్న ముఖ ద్వారాలు రెండు విభిన్నంగా ఉండడంతో పాటు, అందవిహీనంగా మారాయన్నారు. కావున మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.