కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తెలుగు చలనచిత్ర నటుడు సాయిధరమ్ తేజ్.

తేది: 10-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శుక్రవారం ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు సాయిధరమ్ తేజ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు వేదమంత్ర ఉత్సరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు సాయిధరమ్ తేజకు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ అంజనారెడ్డి శాలువా కప్పి సత్కరించి, లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నీలం రవి, ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *