తేది:10-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా : రాయికల్ మండలంలో ఉప్పుమడుగు లోఉప్పుమడుగు లో 4 కోట్ల తో చేపట్టిన కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను సందర్శించారు, 10 లక్షలతో మహిళా సంఘం భవనానికి,రామాజీ పెట్,జగన్నాథ్ పూర్ గ్రామాల్లో 20 లక్షల చొప్పున గ్రామపంచాయతీ,10 లక్షల చొప్పున మహిళ సంఘాల భవనాలకు శంకుస్థాపనలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.
రామాజీపేట గ్రామంలో cc కెమరా లను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో విద్య అభివ్రుద్ది కి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.విద్య తోనే సమాజం లో గౌరవం.కస్తూర్బా పాఠశాల కళాశాల పనులు దాదాపు పూర్తి కావచ్చింది.జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నూతనం భవనం తో కళాశాలలో అదనంగా 100 బాలికలకు ఉపయోగం అన్నారు.
జగిత్యాల లో మహిళా డిగ్రీ కళాశాల తో విద్యార్థిని లకు చాలా ఉపయోగం.ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతో సమాధానం చెప్తా అన్నారు.
రాష్ట్రం లో అభివ్రుద్ది సంక్షేమ రెండు కళ్లు గా సాగుతున్నాయి.
సన్న బియ్యం,200యూనిట్ల ఉచిత కరెంట్,ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలు అమలు చేయడం జరిగింది.
అత్యధిక పల్లె దవాఖాన లు జగిత్యాలకు మంజూరు .
రైతు భరోసా, రుణ మాఫీ తో రైతులకు అండగా ప్రభుత్వం.
గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పండగల జరుగుతున్నాయి.
రాష్ట్రం లో విద్యా వైద్యం వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ.
వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రామాల్లో నీటి వృథా లేకుండా చూడాలి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో మట్టి ఇసుక సరఫరా లో సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలి.
జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.అన్ని కుల సంఘాల భవనాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు గ్రామ ప్రజలకు ప్రజా పాలన అందించడానికి నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం.
జగన్నాద్ పూర్ బ్రిడ్జి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తా…బ్రిడ్జి నిర్మాణానికి డిల్లీ లో కేంద్ర మంత్రిని సైతం కలవడం జరిగింది.
ముఖ్యమంత్రి ,సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి విషయం చెప్పడం జరిగింది.
చెక్ డ్యామ్ నిర్మాణం తో జగన్నాద్ పూర్ లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం సజావుగా సాగింది.
అన్ని విధాలుగా అండగా ఉంటామని,ప్రభుత్వం తో కలిసి పనిచేసి మరింత అభివృద్ధి చేస్తా అన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి రాయికల్ ఎస్సై సుధీర్ రావు DE మిలింద్ సర్పంచ్ లు పరాచ శంకర్,రోజా,బెజ్జంకి మోహన్,ఉప సర్పంచ్ మల్లయ్య,సుధీర్ రెడ్డి,గంగాధర్,, ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి ,మండల నాయకులు కోల శ్రీనివాస్ రవీందర్ రావు ఏనుగు మల్లారెడ్డి సంధ్యారాణి సురేందర్ నాయక్ గన్నే రాజిరెడ్డి,శేఖర్ రెడ్డి,తంగేళ్ళ రమేష్,మొఖీద్, కొండల్ రెడ్డి,మున్ను,తిరుపతి గౌడ్ ,ముత్తన్న, ఏ ఈ ప్రసాద్ వార్డు సభ్యులు మండల గ్రామ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.