‘జన నాయగన్’ సినిమా పైరసీ..! మండిపడుతున్న దళపతి ఫ్యాన్స్..

ఏ ముహూర్తాన దళపతి విజయ్ ఇదే తన చివరి సినిమా అంటూ ‘జన నాయగన్’ ని మొదలెట్టాడో కాని సినిమా రిలీజ్ కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. దీనికి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే అన్న కారణం కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే తాజాగా విడుదల కోసం పురిటినొప్పులు పడుతున్న ఈ సినిమాకి ఇపుడు పైరసీ దెబ్బ గట్టిగానే తగిలింది. ఈ సినిమా నుండి ఏకంగా 48నిమిషాల పుటేజ్ లీక్ అయిందన్న న్యూస్ బయటికి రావడంతో తమిళనాడు అంతటా విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

 

మండిపడుతున్న దళపతి ఫ్యాన్స్

 

ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ జీర్ణించుకోలేక రిలీజ్ కి అడ్డంకులు క్రియేట్ చేస్తున్న కొందరు, ఇపుడు సినిమాలోని సీన్లని లీక్ చేసి సినిమా కున్న క్రేజ్ ని ,విజయ్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు దళపతి ఫ్యాన్స్.ముఖ్యంగా సినిమా పైరసీని చూసేవారిని,లింక్స్ షేర్ చేసేవారిని సైబర్ పోలీసులకి పట్టిస్తామని, మర్యాదగా ఇప్పటి వరకు ఎవరైతే ఈ లింక్స్ ని షేర్ చేశారో వారు వాటిని తొలిగించాలని వార్నింగ్ ఇస్తున్నారు.

 

Tvk పార్టీపై జరుగుతున్న డిజిటల్ ఎటాక్

 

ఇక ఇది ఎలక్షన్స్ టైంలో విజయ్ పై, Tvk పార్టీపై జరుగుతున్న డిజిటల్ ఎటాక్ అని,దయ చేసి లీక్ అయిన మా నాయకుడి సినిమాను చూసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటూ తమిళగ వెట్రి కళగం( TVK) కార్యకర్తలు,అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ఉదృతం చేశారు. విజయ్ ఏంటో కష్టపడి సినిమా చేశాడని, దయ చేసి ఎవరూ పైరసీలో చూసి విజయ్ కష్టాన్ని అవమానించవద్దు అంటూ, ఎవరైనా పైరసీ పుటేజ్ ని షేర్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చిచెబుతున్నారు.ఇందులో భాగంగా తమిళ నాట అంతటా పైరసీ లింక్ లని సర్క్యులేట్ చేస్తున్న టెలిగ్రాం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేస్ ఫైల్ చేశారు దళపతి ఫ్యాన్స్.

 

అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ల క్యామియో

 

ఇకపొతే ఈ లీకైన పుటేజ్ ని బట్టి చూస్తె ఇందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ లు ఇందులో క్యామియో చేసినట్టు తెలుస్తుంది.అయితే సినిమా పైరసీని ఎంకరేజ్ చేస్తూ సినిమాలని ఆగమేఘాలమీద అప్ లోడ్ చేసే తమిళ్ రాకర్స్ సినిమాని అప్ లోడ్ చేయకపోవడం కాస్త ఆశ్చర్యమే. ఏది ఏమైనా ఇంకా సెన్సార్ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న జననాయగన్ ఇలా ఉన్న పళంగా లీక్ అవడం అంటే సినిమాని ప్రొడ్యూస్ చేసిన kvn కి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

 

రెండు వారాల్లో వచ్చే తమిళనాడు ఎన్నికలు

 

ఇక సినిమా విషయానికి వస్తే హెచ్. వినోద్ దర్శకత్వంలో పక్కా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిచడం సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. చూడాలి మరి ఈ సినిమా లీకేజీ వ్యవహారం కేవలం రెండు వారాల్లో వచ్చే తమిళనాడు ఎన్నికలు జరగనున్నఎలక్షన్స్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *