భారీ బడ్జెట్తో అల్లు అర్జున్, అట్లీ “రాకా”..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా(Raaka) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను కూడా జరుపుకున్ననే తెలుస్తుంది. మరికొద్ది నెలలలో అల్లు అర్జున్(Allu Arjun) ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, అట్లీ (Atlee)సినిమా నుంచి ఇటీవల టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

గ్లోబల్ రేంజ్ లో రాకా…

ఈ సినిమాకు రాకా అనే టైటిల్ పెట్టడమే కాకుండా అల్లు అర్జున్ లుక్ కు సంబంధించిన పోస్టర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా పోస్టర్ బయటకు రావడంతో ఈ సినిమా బడ్జెట్ గురించి ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

 

అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యూనరేషన్..

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సుమారు 800 నుంచి 900 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నటుడు అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా సినిమా లాభాలలో 15% వాటా కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటే అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా సుమారు 300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

విజువల్ వండర్ లా రాకా..

 

ఇక దర్శకుడు అట్లీ సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఈయన కూడా 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె కూడా 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోబోతున్నారు అలాగే రష్మిక మందన్న సైతం ఈ సినిమాలో నెగిటివ్ పాత్రకు గాను ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో అట్లీ ఒక విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. మరి ఈ సినిమా బడ్జెట్ గురించి వచ్చే వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *