స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

తెలంగాణలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత లేకపోవడం గమానర్హం. అయితే ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ పరిధిలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపొందారు. కానీ మేడ్చల్ జిల్లాలో ఒక్క స్థానం గెలువలేక పొగా రంగారెడ్డి జిల్లాలో పేరుకు మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ రెండు అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి మహబూబ్నగర్ కోటాలోనే అధిష్టానం పరిగనిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డిలో 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం నాలుగు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అయితే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి ఇచ్చి ఉమ్మడి జిల్లా నాయకులను మౌనం చేసినట్లు ప్రచారం సాగింది.

 

మా జిల్లాకు ప్రాధాన్యత ఏదీ..?

రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు.,అదే రంగారెడ్డి, హైద్రాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి ఇచ్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లా పరిస్థితి అదే ఉండేది. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలు అత్యధికంగా లేకపోయినప్పటికి కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యే లను అధికార పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి దక్కింది. జిల్లా ప్రాధాన్యత క్రమంలోనే మంత్రివర్గంలో ఆనాటి ప్రభుత్వం చోటు కల్పించింది. ఈ నాటి ప్రభుత్వం ప్రాధాన్యత జిల్లాల ప్రకారం కాకుండా వ్యక్తుల ప్రకారం పదవులు ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల వల్ల పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకసారి హెచ్చరించినట్లు సమాచారం.

 

ముగ్గురు ఆశావాహులు..

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. స్పీకర్ పదవితో ప్రయోజనం లేదని మంత్రి పదవీతోనే ప్రజలకు అత్యధిక సేవలు అందిస్తాననే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల వికారాబాద్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… మర్రి చెన్నారెడ్డి తరహాలో అభివృద్ధి చేసి తమదైనా ముద్ర వేయాలని అన్నారు. ఈ మాటలతోనే మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా రెసులో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి లు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *