టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబి (Bobby)త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఏప్రిల్ 11వ తేదీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగి ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ బాబి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని కలిశారు.
ఋషిలా కనిపించారు..
పవన్ కళ్యాణ్ ని కలిసిన ఈయన ఆయనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను ఒక కర్మయోగిని కలిసాను అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బాబి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..”ఆయన్ని కలవడానికి వెళున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం.. ఆయనతో పని చేసిన సమయంలో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక రుషిలా కనిపించారు..
కర్మయోగిని చూశాను..
రాజకీయాలలో తమ ఆస్తులను పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం, కానీ అన్ని సౌకర్యాలను వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపు ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరిగా ఒక మాట చెబుతున్నాను జ్ఞానం కోసం రాజ భోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడి గురించి మనం చరిత్రలో చదువుకున్నాం.. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను. జైహింద్ లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” అంటూ బాబీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ ను కర్మయోగి శిఖరం అంటూ ఈయన ప్రశంసలు కురిపించడంతో పవన్ పట్ల ఈయనకు ఎంతటి గౌరవం ఉందో స్పష్టమవుతుంది అయితే ఇలా ఉన్నఫలంగా బాబి పవన్ కళ్యాణ్ ను కలవడానికి గల కారణమేంటనే చర్చ మొదలైంది బహుశా వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా రాబోతోందా అందుకోసమే పవన్ ను బాబీ కలిసారా లేదంటే ఏప్రిల్ 11వ తేదీ చిరంజీవితో బాబి చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలకటం కోసమే తనని కలిసారా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల నిహారిక వరుణ్ తేజ్ సినిమా పూజా కార్యక్రమాలలో పవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన అన్నయ్య చిరంజీవి సినిమాకు కూడా ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.