తేది: 07-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల- పెగడపల్లి రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ప్రజల నిరీక్షణకు తెరపడింది. కాగా, ఇదే సమస్యపై స్థానిక వార్డు సభ్యురాలు గాండ్ల జ్యోతి వేణు పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలాగే, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా సమస్యను అనేక మార్లు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదాలతో పాటు, దుమ్ము ధూళితో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.