వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్.

తేది: 07-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం ఎక్స్ రోడ్ ప్రాంతంలో గతంలో వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. నిందితుడు షేక్ యాసిర్ (21) ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో వరస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తాళం వేసి ఉన్న దుకాణాలు, ఇళ్లనే టార్గెట్ గా నిందితుడు దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడు పట్టుబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *