మల్యాలలో ఎకరం పొలం గొర్రెల పాలు.

తేది: 06-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో వ్యవసాయ బావుల్లో నీరులేక పొలాలు బీటలు వారుతున్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు నల్ల కిషన్ తన ఎకరం పొలంలో వేసిన వరి పైరుకు నీరు సరిపడక ఎండిపోయింది. దీంతో చేసేదేమీ లేక పొలంలో మేపేందుకు గొర్రెలను వదిలాడు. ఇప్పటికైనా నాయకులు వరద కాలువ ద్వారా గ్రామంలోని చెరువులన్నింటిని నింపి భూములను సస్యశ్యామలం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *