కరోనా పై పోలీస్‌ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్‌

కరోనా కట్టడికి ప్రభుత్వం సూచనలు విస్మరిస్తున్న వారిని నిలవరించేందుకు పోలీస్‌ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ప్రధానంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో అనుమానితులను క్వారంటైన్‌ చేసినప్పటికీ పలువురు నిర్దేశిత ఇంటిని, ఆసుపత్రిని దాటి వచ్చేస్తున్నారు. తప్పించుకుని పారిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి  క్వారంటైన్‌ చేయాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయడానికి కరోనా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు గుంటూరు ఐజీ ప్రభాకరరావు చెప్పారు.

అనుసంధానం ఇలా..  
క్వారంటైన్‌ ఉన్న వారి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. నిరీ్ణత ప్రాంతాన్ని అధిగమించగానే సంబంధిత పోలీస్‌ ఉన్నతాధికారికి అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. తక్షణం ఆ ప్రాంత బాధ్యులైన అధికారికి సూచనలు పంపి క్వారంటైన్‌ను కొనసాగింపజేయడానికి వీలవుతుంది. తొలుత పది మీటర్ల పరిధిలోనే ఉంచాలని భావించినప్పటికీ దాన్ని యాభై లేదా వంద మీటర్ల పరిధి వరకు  విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *