అల్లీపూర్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

తేది:05-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయ కొట్టి ఘన నివాళులు అర్పించారు. గ్రామా సర్పంచ్ గౌతమి-వెంకటేష్ మాట్లాడుతూ.. దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, కుల నిర్మూలన కోసం, మహిళా సాధికారత కోసం ఆయన నిరంతరం పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గురులింగు వినయ్ కుమార్, వార్డు మెంబర్లు అనుమల్ల రాజ్ కుమార్, జాగిరి ప్రశాంత్ , అత్తినేని వనిత, గంగ శేఖర్, వేణు, గంగా నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *