ఆర్ఎంపీ డాక్టర్ ని సన్మానించిన ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి.

తేది:05-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, ఆర్‌ఎంపీ వైద్య నిపుణుడి సమయస్ఫూర్తితో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఆగ్రో ఫెర్టిలైజర్ దుకాణం ముందర ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో కాశిరెడ్డి నారాయణరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఆర్‌ఎంపీ వైద్య నిపుణుడు పిప్పోజి మహేందర్ బాబు పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, వెంటనే సిపిఆర్ కార్డియో పలమనేరి రెసుసైటేషన్ (Cardio Pulmonary Resuscitation) చేశారు.
ఆయన చేసిన సకాల సహాయంతో బాధితుడు కొద్దిసేపటికి మళ్లీ స్పృహలోకి రావడం జరిగింది.తదుపరి బాధితుడిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్ అనిల్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే సిపిఆర్ చేయడం వల్లనే బాధితుడి ప్రాణం కాపాడబడిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్‌ఎంపీ మహేందర్ బాబు చేసిన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు
అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ వంటి ప్రాథమిక వైద్య పరిజ్ఞానం ప్రాణాలను కాపాడగలదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రాథమిక చికిత్సా పద్ధతులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, గన్నె రాజిరెడ్డి, అడ్వకేట్అల్లే పురుషోత్తం, ఏనుగు మల్లారెడ్డి, కోల శ్రీనివాస్, సురేందర్ నాయక్, మున్ను, మాజీ సర్పంచులు నాయకులు తదితరులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *