ఝరాసంగం మండలంలో చోరీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన.

తేది:04-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా :ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన కొత్తూరు సంగన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
దుండగులు రాత్రి సమయంలో ఇంటి గేటు మరియు ప్రధాన ద్వారం తాళాలను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన 4 తులాల బంగారు ఆభరణాలు మరియు 20 తులాల వెండి పట్టీలను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఝరాసంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు On-site FIR నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ చోరీ నేపథ్యంలో మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు:
ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను మరియు నగదును జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ప్రయాణాల సమయంలో: దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లడం లేదా సురక్షితమైన లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం.
గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారు కనిపిస్తే వెంటనే వారి వివరాలు సేకరించాలి.సర్పంచులు, గ్రామ పెద్దలకు సూచన:
గ్రామాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు మరియు పెద్దలు చొరవ చూపాలని పోలీసులు కోరారు.
“గ్రామాల్లోని అన్ని వీధులు, ముఖ్యంగా ఎంట్రీ (ప్రవేశం) మరియు ఎగ్జిట్ (నిష్క్రమణ) పాయింట్లు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది నేరాల నియంత్రణకు మరియు నిందితులను పట్టుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.” ఏదైనా అనుమానం కలిగితే వెంటనే ఝరాసంగం పోలీసులకు సమాచారం అందించాలి అని ఎస్సై క్రాంతి కుమార్ పటీల్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *