రైతుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి.

తేది:03-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో గురువారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ బి .సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సంతోషకరమని తెలిపారు. రైతులు తమ పంటను సంబంధిత కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర కల్పిస్తూ, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతులు నేరుగా తమ పంటను విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు లాభదాయక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. రైతులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, తూకం, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటను శుభ్రంగా, తేమ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, మార్క్‌ఫెడ్ అధికారులు, తహసీల్దార్,వరప్రసాద్ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *