తేది: 03-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వచ్చిన భక్తులు దర్శనానంతరం తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై రద్దీగా మారింది. కాగా, గత మూడు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు నేటితో పరిసమాప్తం కానున్నాయి. సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు తమ ఇష్ట దైవం ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంతోషంతో వెనుతిరుగుతున్నారు. కాగా, హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజన్న సన్నిధానానికి భక్తులు పోటెత్తారు. అంజన్నను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం సాయంత్రం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తుల తాకిడికి అనుగుణంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారు.