ప్రశాంతవంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసిన శ్రీ వీరాంజనేయ స్వామి శోభయాత్ర- శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.

తేది:03-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

ప్రశాంతవంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసిన శ్రీ వీరాంజనేయ స్వామి శోభయాత్ర- శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.

శాంతి భద్రతలను కాపాడుతూ శోభాయాత్రకు సహకరించిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగులపల్లి పవన్ కుమార్ గౌడ్.

పార్టీలకు అతీతంగా శ్రీ వీరాంజనేయ శోభాయాత్రను విజయవంతం చేసిన నాయకులకు మరియు హనుమాన్ భక్త బృందానికి కృతజ్ఞతలు తెలిపిన- శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సిబ్బంది.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో తేది:02-04-2026 నాడు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శ్రీ వీరాంజనేయ శోభయాత్ర లో భాగంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారికి గౌరవ మర్యాదలతో సన్మానించిన శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ గారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారి సూచనల మేరకు, శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ, విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా బృందం మరియు శ్రీ వీరాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ శోభ యాత్రను సదాశివపేట పట్టణంలో గల హనుమాన్ నగర్ నుండి ప్రారంభమై మోమిన్పేట్ రోడ్డు నుండి జాతీయ రహదారి ముంబై నేషనల్ హైవే నుండి వెళ్తూ పుర విధుల గుండా భక్తి భజనలతో, కోలాటాలతో, సాంప్రదాయక నృత్యాలతో, భక్తి పాటలతో, హనుమాన్ చాలీసా పారాయణంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, హిందూ బంధువులు, రామ భక్తులు, శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ బృందం, హనుమాన్ భక్తులు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయడానికి సదాశివపేట పట్టణంలో రామ భక్తులు, హనుమాన్ భక్తులు ప్రసాద వితరణను, అల్పాహారాలను, చల్లని పానీయాలను శోభాయాత్రలో మార్గమధ్యంలో పలుచోట్ల ఏర్పాటుచేసి సేవా భావాన్ని చాటుకున్నారు అందుకు శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ పేరుపేరునా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క శోభయాత్రలో సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్లు తుల్జారాం, కోవూరి శంకర్ గౌడ్, విజయ్ కుమార్, సోమశంకర్, బిట్ల ప్రేమ్ కుమార్, పట్లూరి నాగరాజుగౌడ్, నాగన్న, నాయకులు ఆశిరెడ్డి గారు, సిహెచ్ ఈశ్వర్ గౌడ్,చింత సాయినాథ్, చింత గోపాల్, రేజింతల్ సత్యనారాయణ, శ్రీశైలం యాదవ్, తోట చంద్రశేఖర్(చిన్న) పటేల్, కోవూరి సంగమేశ్వర్, మాణిక్ రావు, శ్రీకాంత్, అడ్వకేట్ ఎర్ర సంక్షయ్ గౌడ్, పెద్ద నరసింహ గౌడ్, కోవూరి రాఘవేందర్ గౌడ్, నల్ల కాశీనాథ్ గౌడ్,ఆలయ కమిటీ సిబ్బంది పవన్ బజాజ్, సుదర్శన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, కోల్కూర్ ప్రవీణ్ కుమార్, కూచిని సతీష్,తుమ్మలపల్లి నాగేష్, వీరన్న, వీరేశం, శివకోటి పంతులు, హనుమాన్ భక్తులు కరాటే శంకర్ గౌడ్, డి. మదన్ మోహన్ గౌడ్, డాకూర్ అశోక్ గౌడ్ మరియు సదాశివపేట పట్టణ ప్రజలు , హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *