అల్లీపూర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

తేది:02-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ కచేరి వద్ద హనుమాన్ దేవాలయంలో బండారు ముత్తయ్య ఆధ్వర్యంలో భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మారుతీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్ కుమార్ మాట్లాడుతూ లోక కల్యాణం కోసం, భక్తుల కష్టాలను తీర్చడానికి హనుమంతుడు అవతరించారని, ఆయనను స్మరించడం వల్ల ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయని హనుమాన్ జయంతి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో అనుమల్ల మల్లేశం, గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *