హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారిని మర్యాదపూర్వకంగా సన్మానించిన- శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.

తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్ట్ ఆర్ నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇట్టి సందర్భంలో హనుమాన్ నగర్ శ్రీ వీరాంజనేయ ఆలయాన్ని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారిని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించిన ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ ఆలయము యొక్క నిర్మాణ పనుల గురించి, ఆలయం యొక్క ప్రత్యేకత గురించి హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర గురించి సవివరముగా జిల్లా ఎస్పీ గారికి తెలియజేశారు. అందుకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ జరిగే శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించాలని, శోభయాత్ర జరిగే మార్గాన్ని పరిశీలించి విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగులపల్లి పవన్ గౌడ్ గారితో కార్యక్రమం ప్రశాంతవంతమైన వాతావరణంలో విజయవంతంగా జరుపుకోవాలని తెలియజేశారు. ఈ యొక్క హనుమాన్ జయంతి శోభయాత్ర కార్యక్రమాన్ని ముందుండి విజయవంతం చేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు ఆలయ కమిటీకి , భక్తజనానికి ప్రత్యేకంగా అభినందించి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సోమశంకర్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కొలుకూరి ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు సుదర్శన్ రెడ్డి, బజాజ్ పవన్ కుమార్, కూచిని సతీష్, తుమ్మలపల్లి నాగేష్, బంటారం వెంకటేశం గౌడ్, శివకోటి పంతులు, ఈశ్వరయ్య, రేజింతల్ సత్యనారాయణ,బట్కారి ప్రభు, రవీందర్, సంగారెడ్డి జిల్లా నూతన గౌడ సంఘం అధ్యక్షులు పెద్ద నర్సింలు గౌడ్, కోవూరి రాఘవేందర్ గౌడ్, నల్ల కాశీనాథ్ గౌడ్, అనంత్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్త బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *