పాదయాత్రలో ప్రమాదం అంజన్న స్వాములను ఢీకొట్టిన పాల ఆటో.

తేది :01-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్.

జగిత్యాల జిల్లా: కుమార్ ఖానాపూర్ నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న అంజన్న స్వాములను రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన పాల ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులకు మోకాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయికల్ ఎస్సై సుధీర్ రావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *