భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు.

తేది:01-04-2026 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ నియోజకవర్గ TSLAWNEWS రిపోర్టర్ లక్ష్మీనారాయణ.

వికారాబాద్ జిల్లా :మోమిన్‌పేట్ మండలం అమరాదికలాన్ గ్రామంలో భూభారతి చట్టం కింద భూముల సర్వేలను నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక సాంకేతిక పద్ధతులతో భూముల సర్వే నిర్వహించడం, రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడం, భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులకు స్పష్టమైన పత్రాలు అందించడంతో పాటు భూ సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొననున్నారు.
అనంతరం స్పీకర్ గారు బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *