శ్రీ వీరాంజనేయ శోభయాత్ర విధులను పరిశీలించిన డీఎస్పీ సత్తయ్య గౌడ్, సిఐ వెంకటేశం గార్లను ఘనంగా సన్మానించిన- శ్రీ వీరాంజనేయ కమిటీ ఆలయ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.

తేది:01-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా గురువారం సాయంత్రం హనుమాన్ మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే శోభయాత్ర శాంతియుతంగా జరపాలని ఆలయ కమిటీ సభ్యులకు డిఎస్పి సత్తయ్య గౌడ్ సూచించారు.
శోభయాత్ర జరిగే వీధులను డి.ఎస్.పి, సీఐ వెంకటేశం పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు డిఎస్పి సత్తయ్య గౌడ్ ను సీఐ వెంకటేశను శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కొత్తగొల్ల సోమశేఖర్, చిన్న పటేల్, పవన్ గౌడ్, ఆశి రెడ్డి, భట్కరి ప్రభు, సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *