తేది:01-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు సిహెచ్ నరసింహ గౌడ్ గారి 31వ వర్ధంతి వేడుకలు సదాశివపేట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం లో మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో కీర్తిశేషులు సిహెచ్ నరసింహ గౌడ్ గారి అభిమానులు పాల్గొని సిహెచ్ నరసింహ గౌడ్ గారి సేవలు చరిత్రలో నిలిచే విధంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని కొనియాడారు. అందుకు కీర్తిశేషులు సిహెచ్ నరసింహ గౌడ్ గారి తనయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఇంకా ఎందులో ఉండదని అందుకు నిదర్శనం గా కీర్తిశేషులు సిహెచ్ నరసింహ గౌడ్ గారిని గుర్తించిన సదాశివపేట పట్టణ ప్రజలకు మరియు అభిమానులకు పేరుపేరునా ఆత్మభివందనాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సిహెచ్ శంకర్ గౌడ్, సిహెచ్ అనిల్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆకుల శివ, శంకర్పల్లి శ్రీనివాస్ గౌడ్, కాటం మల్లేశం గౌడ్, పండు గౌడ్, జగదీష్ గౌడ్, శంకర్ గౌడ్ మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.