మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిరంజీవిని కలిసిన 8వ వార్డ్ మెంబర్ అనుమల్ల రాజ్ కుమార్

తేది:31-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిరంజీవిని అల్లీపూర్ గ్రామానికి చెందిన 8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీవోను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తన వార్డులో నెలకొన్న పలు సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై ఎంపీడీవో సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *