డబ్బా గ్రామ ప్రజల అవసరాలకు డీఫ్రిజిరేటర్ ప్రారంభం.

తేది:31-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజల అత్యవసర అవసరాల కోసం ఏర్పాటు చేసిన డీఫ్రిజిరేటర్‌ను ఇబ్రహీంపట్నం మండల సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ డీఫ్రిజిరేటర్‌ను రాపెల్లి రామకృష్ణ లక్ష్మి తమ స్వంత ఖర్చులతో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గ్రామ ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్, ఉపసర్పంచ్ రాపెల్లి మహేష్, గ్రామ కార్యదర్శి రవళి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *