నాగ్ 100 వ సినిమా..! ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయనున్న మన్మథుడు.!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన కెరీర్ లో 100వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో నాగార్జున ఎంతో బిజీగా ఉన్నారు. నాగార్జున సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఈ సినిమా కోసం తమిళ దర్శకుడు రా కార్తీక్ రంగంలోకి దిగారు . చాలా సైలెంట్ గా నాగార్జున ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం మాత్రం బయటకు రాలేదు ఈ నేపథ్యంలోని ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

నాగార్జున కోసం ముగ్గురు హీరోయిన్లు..

ఈ సినిమా లాటరీ కింగ్(Lottery King) అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది. గతంలో నయనతార ,అనుష్క ఈ సినిమాలో భాగం కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి టబు(Tabu) నటించబోతున్నట్లు నాగార్జున చెప్పకనే చెప్పేశారు.

 

నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్..

ఇక నాగార్జున మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరికి హీరోయిన్లు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది. కొద్దికొద్ది రోజులుగా ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఐశ్వర్య రాజేష్ తో పాటు సుస్మిత భట్(Susmitha Bhatt) కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు నాగార్జునతో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి నాగార్జున 100 వ సినిమాలో ఈ ముగ్గురు నటించబోతున్నట్టు వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగార్జున..

 

ఇక ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ సినిమాను స్వయంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి వివరాలను చిత్ర బృందం అధికారకంగా వెల్లడించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన పార్ట్ 3 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇదివరకే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.. ఇలా వరుస సినిమాలతో పాటు నాగార్జున మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *