తేది:30-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆయన ప్రత్యేక కళా ప్రదర్శన చేశారు.ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి, పోలీస్ క్రిష్ణయ్య త్యాగాలను గుర్తు చేస్తూ భావోద్వేగభరిత ప్రదర్శన ఇచ్చారు.అనంతరం ప్రజా యుద్ధనౌక గద్దర్ పాత్రను ప్రతిబింబిస్తూ “పొడుస్తున్న పొద్దు” పాటకు అనుగుణంగా ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తదుపరి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ పాత్రను ప్రత్యేక స్కిట్ రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నాగరాజు ని అభినందించారు.ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తు చేస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.