తేది:30-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా జరిగిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు చురుకుగా పాల్గొన్నారు. మొదటి రోజు నిర్వహించిన తాడు ఆట, కబడ్డీ పోటీలతో పాటు రెండో రోజు జరిగిన వాలీబాల్, క్రికెట్ పోటీలలో కూడా ఆయన ఉత్సాహంగా పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు..నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో గద్దర్ వేషధారణలో ప్రత్యేక ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులు శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజా యుద్ధనౌక గద్దర్ పాత్రను ప్రతిబింబిస్తూ అద్భుతంగా ప్రదర్శన చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ పాత్రను ప్రత్యేక స్కిట్ రూపంలో ప్రదర్శించారు.ఈ ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ టీం సభ్యులకు మొదటి బహుమతిని అందజేశారు.
అనంతరం నేడు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల నివాసంలో ఎమ్మెల్యే నాగరాజు ని వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అబ్బిడి రాజీరెడ్డి మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.