తేది:30-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: సోషల్ మీడియా వచ్చాక మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో నేడు మాట్లాడుతూ, ఇటీవల తాను రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొంటే దానిపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల పట్ల కూడా కొందరు విచక్షణ కోల్పోయి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.గతంలో తాను అసెంబ్లీ ఎదుట బందోబస్తు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించడంతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టానన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎప్పటికప్పుడు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.గతంలో డీసీపీగా, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసు అధికారులకు సూచిస్తున్నామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోకి వెళ్లినప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై స్థానిక ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా మరింత క్రమశిక్షణతో పనిచేస్తూ వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.