సినీనటి సమంత తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మహిళ సాధికారత గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి అలాగే వారి భద్రత గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇటీవల మహిళల గురించి సమంత మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఇతరులు కోసం తమ ఇష్టాలను వదులుకుంటున్నారని తెలిపారు. దీనిని ఒక త్యాగం అని గుర్తించలేనంతగా మనం అలవాటు పడిపోయాం అంటూ ఇటీవల మహిళల కోసం గళం విప్పిన సమంత తాజాగా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి మాట్లాడారు.
ఇండస్ట్రీలో మహిళలకు భద్రత లేదు..
భారతదేశ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని ఈమె తెలిపారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహిళలకు ఉద్యోగ భద్రత లేదు అలాగే పని గంటలు, వారికి సరైన రక్షణ లేకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలు మాత్రం చాలా ధైర్యంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో పురుషుల కంటే మహిళలకి ఎక్కువ కష్టం ఉందని సమంత తెలిపారు. ఇక సినిమాల విషయంలో మేల్ ఓరియెంటెడ్, ఫీమేల్ ఓరియంటెడ్ అంటూ సినిమాల మధ్య చూపించే వివక్షతను మానుకోవాలని తెలిపారు.
హీరోయిన్లు అంటే గ్లామర్ కోసమే కాదు..
ఇటీవల కాలంలో హీరోయిన్ పాత్ర అంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు లేదంటే హీరోతో రొమాన్స్ కోసమే హీరోయిన్ల పాత్రలను పరిమితం చేస్తున్నారు. హీరోయిన్ల పాత్రలను ఇలా కాకుండా హీరోలో ధైర్యాన్ని నింపే పవర్ ఫుల్ పాత్రలు హీరోయిన్లకు ఇవ్వాలని సమంత తెలిపారు.ఇక వీటన్నింటినీ పక్కన పెడితే సినిమా షూటింగ్ సమయంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి అంటూ ఈమె ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ 2026 కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీలో ఉన్న మహిళల భద్రత గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మా ఇంటి బంగారం పనులలో బిజీగా సమంత..
సమంత ప్రత్యేకంగా మహిళల భద్రత గురించి మాట్లాడారు అంటే ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్పష్టమవుతుంది.. ఇక సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె వెండి తెరపై చివరిగా ఖుషీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు సమంత వెండి తెరపై కనిపించిన దాఖలాలు లేవు. త్వరలోనే ఈమె నందిని రెడ్డి దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.