కొండగట్టు పాదయాత్రకు బయలుదేరుతున్న అంజన్న స్వాములకు వాటర్ బాటిళ్లు అరటిపండ్లు పంపిణీ..

తేది: 29-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్

జగిత్యాల జిల్లా: అల్లీపూర్ గ్రామంలో కొండగట్టు పాదయాత్ర చేస్తున్న అంజన్న స్వాములకు ఆదివారం 8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వాటర్ బాటిళ్లు అరటిపండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. గత మూడు రోజులుగా గ్రామం మీదుగా వెళ్తున్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాతలు అనుమల్ల రాజేందర్, వంగరి మధు, చెక్కపల్లి శ్రీకాంత్, రాజశేఖర్, బొమ్మకంటి ఉమేష్, సోమ శ్రీనివాస్, సిరిపురం రాజ్ కుమార్, కర్నే రాకేష్, చిలువేరి మహేష్, రేపాక జలంధర్ రాములు బండారి ముత్తయ్య, ఎంబారి రమేష్, స్వామి, వేణు రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *