తేది: 29-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నేషనల్స్‌లో హాకీ ఆడిన విషయం గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను ప్రారంభిస్తూ, రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.