దళితుల పట్ల బిఆర్ఎస్ పార్టీ చిన్న చూపు చూపుతోందని విమర్శించారు.

తేది:29-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా నేడు గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వాలీబాల్, క్రికెట్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అద్భుతమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ ప్రదర్శిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని తెలిపారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడటమే కాకుండా పరస్పర స్నేహభావాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా ప్రజల్లో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *