తేది: 29-03-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా: నల్గొండ మండలం (దోమలపల్లి గ్రామం),
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా, మాదకద్రవ్యాలు రహిత జిల్లాను లక్ష్యంగా చేసుకుని “మిషన్ పరివర్తన్” కార్యక్రమం దోమలపల్లి గ్రామంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం శ్రీ శరత్ చంద్ర పవర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడగా, రూరల్ ఎస్సై సైదాబాబు గారు గ్రామ ప్రజలకు రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు. బైక్పై ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. అలాగే ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే వినియోగించాలన్నారు.
యువతను ముఖ్యంగా గాంజా మరియు ఇతర మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సూచిస్తూ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉండగలదని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిల్పా సతీష్ రెడ్డి గారు, వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు, యువకులు k. బాలకృష్ణ S సునీల్ K. శంకర్ నాగేష్ G. అనిల్ U. నాగరాజు J.పరమేష్ K నగేష్ Ch. వెంకటాచారి గాలిబ్ బ్రహ్మయ్యచారి గయాస్ K.వెంకన వీరంత్ యాదవ్ అచ్చిరెడ్డి S మనోహర్ గార్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.