స్త్రీనిధి సేవల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఇబ్రహీంపట్నం సీసీకి గౌరవం.

తేది:29-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా ఆర్థిక సంవత్సరం 2024-25లో స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశిష్ట సేవలందించిన ఇబ్రహీంపట్నం మండలం (పాత మెట్‌పల్లి)కు చెందిన సీసీ కే. పురుషోత్తం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), SERP సీఈఓ దివ్య దేవరాజన్ (IAS), స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్ చేతుల మీదుగా పురుషోత్తంకు సన్మానం చేశారు. స్త్రీనిధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *