తేది: 29-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: శంకరంపేట-ఆర్ మండలం జంగరాయి గ్రామంలో తేది:28-03-2026 నాడు వృద్ధ దంపతులపై జరిగిన దాడి, దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. ముసుగు ధరించి దాడి చేసిన నిందితుడిని కేవలం 48 గంటల్లోనే అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలు, అలాగే నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని సమర్థంగా వినియోగించి నిందితుడిని గుర్తించారు. వేగవంతమైన దర్యాప్తుతో కేసును పరిష్కరించడం గమనార్హం. విచారణలో అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించగా, ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ప్రజలకు సూచనలు:
అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.