ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు యుద్ధం ఆపాలి C P I M L లిబరేషన్ వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్ లో నిరసన ర్యాలీ.

తేది:29-03-2026  హన్మకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్

వరంగల్ జిల్లా: పోచమ్మ మైదాన్ సెంటర్లో CPIML లిబరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం ఆపాలని మార్చి 18 తేదీ శనివారం ఉదయం 11 గంటలకు నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా నైనాలశెట్టి మూర్తి కేంద్ర కమిటీ సభ్యులు అక్కెనపల్లి యాదగిరి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పాల్గొని ప్రసంగించారు ఇరాన్ దేశం పై దుర్బుద్ధితో చేస్తున్న ఇజ్రాయిల్ దేశం దానికి మద్దతుగా అమెరికా దేశం చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు
అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానం వల్ల ప్రపంచ శాంతి కి విగాథం కలిగిస్తుంది అమెరికా తన ఆయుధ సంపత్తిని పెంచుకో వడానికి తమ దగ్గర ఉన్న ఆయుధాల నిలువలను అమ్ముకోవడానికి అన్ని దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పెత్తనం చేస్తుంది యుద్దాలను సృష్టించడం కోసం వెనిజులా ఇరాన్ క్యూబా తమకు గిట్టని దేశాలపై కవ్వింపు సైనిక చర్యలు చేస్తూ ప్రపంచంలోని అన్ని దేశాల పైన తమ పెత్తనం కొనసాగిస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలన్నిటిని ఉల్లంఘించి ఏక దృవ ప్రపంచం సాధించడం కోసం అమెరికా తప్పుడు పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది యుద్దాలను తన వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది ట్రంపు తమ మాట వినని దేశాలపై విచ్చలవిడిగా పన్నుల శాతాన్ని పెంచి వేస్తుంది దీనివల్ల అన్ని రకాల వస్తువులపై అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అక్కెనపల్లి యాదగిరి తెలిపారు తక్షణమే ఇరాన్ దేశంపై చేస్తున్న యుద్ధాన్ని అమెరికా ఇజ్రాయిల్ ఆపాలని పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు
ఇన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి భారతదేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి గురవుతున్నారు అక్కడ ఎక్కడో యుద్ధం జరిగితే మన ఇండ్లలో సరుకుల ధరలు పెరుగుతున్నాయి భారతదేశంలో ఎగుమతులు దిగుమతుల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంపు తప్పుడు విధానాల వల్ల మన దేశ సాధారణ ప్రజలు పేద ప్రజల జీవితాలు చితికి పోతున్నాయి భారతదేశ పాలకులు స్వతంత్ర విధానం తీసుకోవాలి అమెరికా ట్రంప్ ఒత్తిళ్లకు తలగొద్దు మన ప్రజలపై భారాలు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఉపాధి ఉద్యోగాలను కాపాడాలని కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రవిరాకుల ప్రసంగి పట్టేం మొగిలి కంది రవి పెండ్యాల ఓంకార్ భాగ్య బుస ఆగయ్య జై శెట్టి సమ్మయ్య ఆలేటి శివాచారి అప్పాల శంకరాచారి దండే బోయిన ఓదెల్ బింగి సంపత్ మున్ని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *