మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరు తాజాగా మరో సినిమాకి ముహుర్తం పెట్టేశాడు. యస్ ..వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీ మరోసారి చిరుతో చేయబోయే మెగా158 సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైనట్టు తెలుస్తుంది.
ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
హైదరాబాద్‌లోని KVN ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కన్నుల పండగగా జరగగా ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిరంజీవిపై క్లాప్ కొట్టడం కొట్టడం విశేషం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాను KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే బాబీ – చిరు కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.సో .. అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారన్న మాట.అయితే ఇదే పొంగల్ బరిలో అనిల్ – వెంకీ సినిమా కూడా వస్తున్న సంగతి తెల్సిందే.మరి వచ్చే పొంగల్ దంగల్ లో చిరు – వెంకీల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.
మొదటి షెడ్యూల్‌లో చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్
ఇక మొదటి షెడ్యూల్‌లో భాగంగా చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారని ఆ తర్వాత వెంటనే ఓ మాస్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, మలయాళ స్టార్ మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి.
మొత్తానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒక గ్లోబల్ హైప్ వచ్చేసిందన్నది నిజం . మరి ‘వాల్తేరు వీరయ్య’ మ్యాజిక్‌ను బాబీ మళ్లీ రిపీట్ చేస్తారా? సంక్రాంతి బరిలో చిరు మళ్లీ విన్నర్‌గా నిలుస్తారా? అనేది కాలమే డిసైడ్ చేయాలి !