శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో దాతల సహకారంతో ఆరు సిమెంట్ బెంచీలు.

తేది:28-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో దాతలు ఆరు సిమెంట్ బెంచీలు వేయించినారు స్వర్గీయ వంగరి మురళి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు వంగరి మధు గాయత్రి దంపతులు రెండు సిమెంట్ బెంచీలు, హనుమాన్ భజన మండలి వారి తరఫున రెండు సిమెంట్ బెంచీలు, పద్మశాలి యువజన సంఘం వారు ఒక సిమెంట్ బెంచ్, స్వర్గీయ నామని సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక సిమెంటు బెంచ్ వేయించడం జరిగింది. దాతలను గ్రామస్తులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి అధ్యక్షులు చిట్యాల భూమయ్య, కోశాధికారి అనుమల్ల మల్లేశం, ఉపాధ్యక్షులు మిట్టపల్లి దామోదర్, ప్రధాన కార్యదర్శి నామని లక్ష్మీనరసయ్య, దేవాలయ చైర్మన్ నామని శేఖర్, గురులింగు మఠం వినయ్ కుమార్ (ఉపసర్పంచ్) , పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మోర గణేష్, ప్రధాన కార్యదర్శి మోర శివకుమార్, మాజీ అధ్యక్షులు భోగ నరసయ్య పద్మశాలి సేవా సంఘం కోశాధికారి పొట్టవత్తిని నాగభూషణం, సభ్యులు బొమ్మకంటి రాజు, పోతు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *