హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:28-03-26 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా : హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే ఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లుతూ వినతి పత్రం సమర్పించారు.ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్ మండల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఆ స్థలంలో నూతన EV చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని తెలిపారు.అదేవిధంగా, నియోజకవర్గానికి 100 కొత్త EV బస్సులను కేటాయించాలని మంత్రి వద్ద విజ్ఞప్తి చేశారు. ఈ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన, ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక, కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్ స్టేషన్ మరియు EV బస్సుల నిర్వహణలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. RTC సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *