క్రీడల పట్ల గొప్ప స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే నాగరాజు.

తేది:28-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నేషనల్స్‌లో హాకీ ఆడారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, ప్రజాప్రతినిధులు కూడా క్రీడల్లో పాల్గొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అలాగే, గ్రామీణ స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన వసతులు, శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *