తేది: 28-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన #ArriveAlive కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లు మరియు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ వినియోగం వంటి కారణాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.