మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క సినిమాకి పూర్తిస్థాయిలో తన మద్దతు తెలియజేస్తూ సినిమాల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నేడు రామ్ చరణ్ (Ramcharan) పెద్ది సినిమా(Peddi Movie) నుంచి విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్(pehelwan glimpse) వీడియో చూసిన అనంతరం చిరంజీవి(Chiranjeevi)తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా దర్శకుడు బుచ్చిబాబు(Bucchi Babu) పై ప్రశంశల వర్షం కురిపించారు. రామ్ చరణ్ నేడు 41 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
బుచ్చిబాబు పై చిరు ప్రశంసలు..
ఈ నేపథ్యంలోనే పుట్టినరోజు సందర్భంగా కుస్తీ పోటీలకు సంబంధించిన ఈ గ్లింప్స్ షేర్ చేయడంతో ఇది కాస్త సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక చిరంజీవి డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఈ పహిల్వాన్ గ్లింప్స్ వీడియో చూశారు ఈ వీడియో చూసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉందని, ఈ వీడియోలో చరణ్ ను అద్భుతంగా చూపించారు అంటూ బుచ్చిబాబు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇలా చిరంజీవి పొగడడంతో బుచ్చిబాబు ఏకంగా చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పహిల్వాన్ గ్లింప్స్ పై మెగా ప్రశంసలు..
ఇలా చిరంజీవి ఎప్పటికప్పుడు పెద్ది సినిమా గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వచ్చారు. ఇటీవల ఈ సినిమా నుంచి రై రై రారా అంటూ సాగిపోయే పాట పట్ల కూడా చిరంజీవి స్పందిస్తూ తన కొడుకు చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం పహిల్వాన్ గ్లింప్స్ పై మెగా ప్రశంసలు అందడంతో ఈ సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ జోడిగా ఈ సినిమాలో నటి జాన్వీ కపూర్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మరొక వారం రోజులలో పూర్తి కాబోతోంది. వారం రోజులలో షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ముందుగా అనుకున్న విధంగానే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదంటూ చిత్ర బృందం ఈ సినిమా 30 వ తేదీనే విడుదల కాబోతుందని నేడు గ్లింప్స్ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా ఈ పాటలకు ఎంతో అద్భుతమైన ఆదరణ లభించింది. ఇటీవల కాలంలో చరణ్ సరైన సక్సెస్ అందుకోని నేపథ్యంలో మంచి హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెద్ది సినిమా పైనే మెగా అభిమానుల ఆశలన్నీ ఉన్నాయని చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.