తేది:27-03-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా, ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కీలకమని ఆయన పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతులు ఎంతో అవసరమని తెలిపారు.
అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనుల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.