తేది:27-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: శ్రీరామ నవమి పురస్కరించుకుని అల్లీపూర్ గ్రామ హనుమాన్ దేవాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. గ్రామ పంచాయతీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అర్చకులు భువనేశ్వర్, వినయ్ కుమార్, విక్రమ్ వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంబారి గౌతమి-వెంకటేష్, ఉపసర్పంచ్ వినయ్ కుమార్, వార్డు సభ్యులు అనుమల్ల రాజ్ కుమార్, ప్రశాంత్, లక్ష్మి, రాధ, సంధ్యా, భవాని, కారోబార్ రాజేందర్, సంజీవ్, గంగ శేఖర్ శ్రీనివాస్, పొట్టవత్తిని నాగభూషణం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.