ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో దువ్వ నవీన్, శ్రీకాంత్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.

తేది:27-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

హన్మకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన మెట్టుగుట్ట మాజి చైర్మన్ దువ్వ నవీన్ మరియు మాజి దర్గా సొసైటీ డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్ నేడు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాస కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల మంత్రివర్యులు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత మంది నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కృష్ణారెడ్డి, కర్ర హరీష్ రెడ్డి, జన్నపురెడ్డి రుగ్వేద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *