తేది:26-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన ఐదు రోజుల ఓరియెంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమం ముగిసిన సందర్భంగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో రామకృష్ణ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టంలోని అంశాలపై ప్రతి వార్డు సభ్యుడు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ట్రైనింగ్‌లో భాగంగా మాస్టర్ ట్రైనర్లు రాకేష్, రమేష్, రాజశేఖర్, రవి లు వివిధ అంశాలపై శిక్షణ అందించారని పేర్కొన్నారు.మొదటి బ్యాచ్‌లో అమ్మకపేట, ఎర్రాపూర్, డబ్బా, వర్షాకొండ, కోమటి కొండపూర్, కేశాపూర్, కోజన్ కొత్తూరు, ఇబ్రహీంపట్నం గ్రామాలకు చెందిన మొత్తం 79 మంది వార్డు సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహేశ్వర రెడ్డి, సీనియర్ సహాయకులు లక్ష్మయ్య, ఏపీఎం శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.