తేది:26-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నీటి వసతి సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, దాన్ని వెంటనే క్లియర్ చేసి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ను త్వరితగతన పూర్తి చేస్తే అంజన్న భక్తులకు నీటి కష్టాలు తప్పుతాయని ఎమ్మెల్యే అన్నారు.